–400 మంది క్రీడాకారుల హాజరు
– రాష్ట్ర స్థాయికి 30 మంది ఎంపిక
సలాం ప్రొద్దుటూరు:
భాష అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-14, అండర్-16 జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 400 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పోటీల్లో 60 మీటర్లు, 600 మీటర్ల పరుగులు, లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో, షాట్‌పుట్, ట్రైయాథ్లాన్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.
ఈ పోటీల ఆధారంగా ఎంపికైన 30 మంది క్రీడాకారులు ఆగస్టు 11, 12, 13 తేదీల్లో తిరుపతిలో జరగనున్న ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
క్రీడల నిర్వహణలో వ్యాయామ సంచాలకులు నాగూర్ భాష, సుబ్బయ్య, రాఘవ, చరణ్, నాగేశ్వరరావు, ప్రణవి, హసీనా, ఖాదర్ రెడ్డి, దిలీప్, కోచ్ వివేకానంద రెడ్డి, శివ తదితరులు విశేషంగా సహకరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు వై. అహమర్ భాష, భాష అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి మరియు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
