ePaper
Friday, July 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆర్టీసీ సంస్థనే విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలి 

ఆర్టీసీ సంస్థనే విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలి 

📰 Generate e-Paper Clip

 

–ఆర్టీసీ స్థలాలు కారుచౌకగా లీజుకు ఇచ్చే విధానాలకు స్వస్తి పలకాలి

 

–కడప ఆర్టీసీ డిపో ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా

సలాం ప్రొద్దుటూరు (కడప):

 

 

ప్రజా రోడ్డు రవాణా వ్యవస్థను కాపాడుకోవాలనీ ఆర్టిసి ప్రైవేటీకరణ ఆపాలనీ విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థనే కొనుగోలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం కడప ఆర్టీసీ డిపో ముందు నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసి బాదుల్లా మాట్లాడుతూ 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆర్టీసీ సంస్థను పాలక ప్రభుత్వాలు తమ ప్రచార ఆర్భాటాల కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు.కోట్ల రూపాయల స్థలాలు ఆస్తులు కలిగిన ఆర్టీసీని కారు చౌకగా లీజుల పేరిట కట్టబెట్టడం మానుకోవాలని హితవు పలికారు. విద్యుత్తు బస్సులు కొనుగోలుకు నిర్వహణకు కేంద్రం ఇచ్చే 60 శాతం రాష్ట్రం వాటా 40 శాతం ఆర్టీసీ సంస్థనే కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. కడప బస్టాండ్ 2.5 ఎకరాల భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తున్న స్థలం అనంతపురం, కర్నూలు లలో బస్ డిపోలు నిర్మించి విద్యుత్ బస్సులు నిర్వహణ ప్రైవేటు సంస్థకు అప్పగించాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ‘స్త్రీ శక్తి’పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రజా రవాణా అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశాలకు ఆర్టీసీ బస్సులను వాడుకుంటూన్నాయని గత రెండు సంవత్సరాల కాలంలో ఒక కొత్త బస్సు కొనుగోలు చేయలేదని రిటైర్మెంట్ అవుతున్న వారి స్థానంలో కొత్తవారిని తీసుకోలేదని గుర్తు చేశారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వ విలీనం చేసినారే తప్ప ఉద్యోగాలకు ప్రత్యేకంగా ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు పెండింగ్ లో ఉన్న డీఏలు ఇవ్వాలని పే రివిజన్ చేయాలని ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు లేవని సామాజిక భద్రత చట్టాలు వర్తింప చేయాలని ఆప్కాస్ విధానం అమలు చేయాలని ఆన్ కాల్ డ్రైవర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు మూర్తి ఏఐటీయూసీ నగర కార్యదర్శి మద్దిలేటి జిల్లా కార్యదర్శి లింగన్న నగర అధ్యక్షులు మల్లికార్జున వర్కింగ్ ప్రెసిడెంట్ పి సుబ్బరాయుడు నాయకులు విజయ్ నారాయణ హుస్సేన్ వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!