ePaper
Friday, July 24, 2026
ePaper
Homeజాతియంనీట్ పేపర్ లీక్‌పై కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి–ఎంపీజే,ఐవైయం, SIO, సంపూర్ణ...

నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి–ఎంపీజే,ఐవైయం, SIO, సంపూర్ణ మద్దతు

📰 Generate e-Paper Clip

 

 

సలాం ప్రొద్దుటూరు :

 

నీట్ పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టిందనీ. పరీక్షల పారదర్శకత, న్యాయబద్ధత, విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలు నెలకొన్న ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, సమస్యను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరంమనీ. ఈ ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఎంపీజే,ఐవైయం, SIO, నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎంపీజే కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడారు.

 

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీలో పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను సంభాషణ, చర్చల ద్వారా పరిష్కరించాల్సిన చోట బలప్రయోగానికి పాల్పడటం తీవ్రంగా ఖండించ దగ్గ విషయం అన్నారు. ఇది విద్యార్థుల హక్కులపై దాడి మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తిపై కూడా దాడిగా పరిగణించాల్సి ఉంటుందన్నారు.

 

దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో నెలకొన్న అవకతవకలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, నీట్ పేపర్ లీక్ వంటి ఘటనలు విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చూపుతాయిన్నారు . ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనలను అణచివేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థి సంఘాలు, విద్యా నిపుణులు, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనీ డిమాండ్ చేశారు. అలాగే నీట్ పేపర్ లీక్‌పై సమగ్ర, స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

 

ఈ నేపథ్యంలో శుక్రవారం విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్‌కు MPJ-IYM-SIO ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. రాష్ట్రంలోని విద్యార్థులు, యువత, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఈ బంద్‌కు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ హక్కును కాలరాస్తూ విద్యార్థులపై దాడులకు పాల్పడటం ఆమోదయోగ్యం కాదనీ చెప్పారు. ఢిల్లీ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన విద్యార్థులకు న్యాయం చేయాలని, అలాగే నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం,జిల్లా అధ్యక్షులు జాకీర్ ఉమ్రి,పట్టణ అధ్యక్షులు హుస్సేన్ బాష,ఐ వైయం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేపారి షఫీ, పట్టణ అధ్యక్షులు జబిబుల్లా,రహిమాన్ పట్టణ అధ్యక్షులు రోషన్, ఇజాజ్, ముక్తాయార్, అల్లాబకాష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!