ePaper
Wednesday, September 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలని ప్రైవేట్ విద్యాసంస్థల సంఘానికి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ వినతి

విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలని ప్రైవేట్ విద్యాసంస్థల సంఘానికి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ వినతి

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు):

ఈ నెల 24న (శుక్రవారం) నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు జమ్మలమడుగులో ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ ప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హరిబాబు, డివైఎఫ్ఐ నాయకుడు తులసీశ్వర్ యాదవ్, డివైఎఫ్ఐ పట్టణ ఉపాధ్యక్షుడు సుభాన్, ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకుడు దస్తగిరి మాట్లాడుతూ విద్యార్థులు, విద్యా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన విద్యాసంస్థల బంద్‌కు అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొని బంద్‌కు సంఘీభావం తెలపాలని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!