ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరులో రేపు టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం

ప్రొద్దుటూరులో రేపు టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాల సందర్భంగా చేపట్టనున్న ఇంటింటి ప్రచార కార్యక్రమంపై ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కార్యాలయం వెల్లడించింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 4 గంటలకు కొర్రపాడు రోడ్డులోని ఎస్.కే.ఎస్.సీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ సమావేశం జరగనుంది.

 

సమావేశంలో ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం, మై టీడీపీ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాల అమలు, సంస్థాగత బలోపేతానికి సంబంధించిన అంశాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశానికి టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జీలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!