ప్రొద్దుటూరులో రేపు టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం
సలాం ప్రొద్దుటూరు: రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాల సందర్భంగా చేపట్టనున్న ఇంటింటి ప్రచార కార్యక్రమంపై ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కార్యాలయం వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 4 గంటలకు కొర్రపాడు రోడ్డులోని ఎస్.కే.ఎస్.సీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో ప్రభుత్వ రెండేళ్ల పాలన...