సలాం ప్రొద్దుటూరు:
కడప పబ్లిక్ హెల్త్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా ఇటీవల బదిలీపై వచ్చిన డి. సతీష్ కుమార్ బుధవారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో పబ్లిక్ హెల్త్ విభాగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
