సలాం ప్రొద్దుటూరు:
రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాల సందర్భంగా చేపట్టనున్న ఇంటింటి ప్రచార కార్యక్రమంపై ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కార్యాలయం వెల్లడించింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 4 గంటలకు కొర్రపాడు రోడ్డులోని ఎస్.కే.ఎస్.సీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ సమావేశం జరగనుంది.
సమావేశంలో ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం, మై టీడీపీ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాల అమలు, సంస్థాగత బలోపేతానికి సంబంధించిన అంశాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశానికి టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జీలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.