ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్గాంధీ రోడ్డుపై పారుతున్న మురుకి నీరు 

గాంధీ రోడ్డుపై పారుతున్న మురుకి నీరు 

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు :

ఆదివారం గాంధీ రోడ్డు లోని వినాయక నగర్ నుంచి డీలక్స్ ఫోటో స్టూడియో వరకు కాల్వలో ఉండాల్సిన మురికి నీరు రోడ్లపై పారుతుంది. కాల్వల్లో అడ్డంకులు ఏర్పడడంతో మురుగునీరు బయటికి వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. మురుగునీరు బయట పొరలడంతో అటుగా వెళుతున్న వాహనదారులు, ప్రజలకు అందులోంచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మురుగునీరు చేరడం వలన ఆ ప్రాంతం దుర్వాసనతో కంపు కొడుతుంది. ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో కొద్దిపాటి వర్షం పడిన రోడ్లన్నీ మురుగునీరుమయం అవుతున్నాయని స్థానికులు వాప్పుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చేయాలని ప్రొద్దుటూరు ప్రజలు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!