ePaper
Sunday, November 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రజాప్రతినిధుల ప్రతిజ్ఞ!

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రజాప్రతినిధుల ప్రతిజ్ఞ!

📰 Generate e-Paper Clip

 

–ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

 

సలాం   ప్రొద్దుటూరు:

 

భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షిస్తూ ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలందిస్తామని ప్రొద్దుటూరు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి, కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు, అధికారులు భారత రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తిరుగులేని పునాది అని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.ప్రజాప్రతినిధులుగా రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ ప్రజల హక్కులను కాపాడటం, పారదర్శక పాలన అందించడం, తమ విధులను నిబద్ధతతో నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమాన అవకాశాల కల్పనలో రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ మున్సిపల్ ఇంజనీర్ ఎం. రాజేష్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. రమేష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యశోద, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!