ePaper
Sunday, November 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన.. మాస్టర్ కాలేజీలో MPJ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు!

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన.. మాస్టర్ కాలేజీలో MPJ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు!

📰 Generate e-Paper Clip

 

సలాం   ప్రొద్దుటూరు 

 

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరులోని మాస్టర్ కాలేజీలో మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) ఆధ్వర్యంలో విద్యార్థులకు రాజ్యాంగ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, పౌరుల బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MPJ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాషా, అడ్వకేట్ షకీల్ అహ్మద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అడ్వకేట్ షకీల్ అహ్మద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల గురించి వివరించారు. ప్రతి పౌరుడు తన హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఇతరుల హక్కులను గౌరవించడం కూడా బాధ్యతగా గుర్తించాలని సూచించారు.MPJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాషా మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయం, సమానత్వం, ప్రజా సంక్షేమం సాధనలో వీటి పాత్ర ఎంతో కీలకమని వివరించారు.MPJ కడప జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ ఉమ్రి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగ సభ కృషి, రాజ్యాంగ రూపకల్పన వెనుక ఉన్న ఆశయాలను విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ వాటిని నిత్యజీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.అనంతరం మాస్టర్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డికి MPJ సభ్యులు భారత రాజ్యాంగ ప్రతిని బహుకరించారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, MPJ రాయలసీమ ఇన్‌చార్జ్ అయూబ్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, పట్టణ కార్యదర్శి మహమ్మద్ రఫీ, MPJ సభ్యులు ముక్తార్, గౌస్ లాజం తదితరులు పాల్గొన్నారు.రాజ్యాంగం కేవలం ఒక గ్రంథం కాదు.. ప్రతి పౌరుడి హక్కులకు రక్షణ కవచం, బాధ్యతలకు మార్గదర్శకం. రాజ్యాంగ స్ఫూర్తిని యువతలో పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ అవగాహన సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!