–మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి
సలాం ప్రొద్దుటూరు:
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో ఈ నెల 9న వన్‌డే క్లాస్ నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు మండల కమిటీ అధ్యక్షురాలు రాజేశ్వరి, కార్యదర్శి లక్ష్మీప్రియ తెలిపారు.ఈ కార్యక్రమానికి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి. సావిత్రమ్మ హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మహిళలకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐద్వా ప్రొద్దుటూరు మండల కమిటీ పిలుపునిచ్చింది.కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.
