సలాం ప్రొద్దుటూరు:
గోపవరం పంచాయతీ పరిధిలోని కల్వకట్ట దర్గా వద్ద దస్తగిరి స్వామి పండుగ ఘనంగా గురువారం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.టిడిపి యువ నాయకుడు బచ్చల వీర ప్రతాప్, మాజీ ఎంపీటీసీ పొట్టు లక్ష్మీ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా దర్గాకు వచ్చిన భక్తులతో పాటు కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో నల్లబోతుల మద్దిలేటి, గురు శశిధర్ రెడ్డి, దేశిరెడ్డి గురివి రెడ్డి, మార్తాల జగన్ రెడ్డి, మౌలాలి, శ్రీను, మధు, శెట్టిపల్లె సిద్దయ్య, బాలయ్య, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

