ప్రొద్దుటూరు సీఎం పర్యటన ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

–మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ యువనేత నంద్యాల కొండారెడ్డి సలాం   ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ యువనేత నంద్యాల కొండారెడ్డి పాల్గొన్నారు.సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. సభా ప్రాంగణం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, పార్కింగ్, ప్రజలకు...