ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మహబూబ్‌నగర్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం

మహబూబ్‌నగర్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం

📰 Generate e-Paper Clip

 

 

–ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చొరవతో నూతన నీటి బోరు ఏర్పాటు

 

సలాం ప్రొద్దుటూరు –  మైదుకూరు:

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్‌నగర్ వీధిలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రత్యేక చొరవతో స్థానికంగా నూతన నీటి బోరును ఏర్పాటు చేశారు.మహబూబ్‌నగర్ వీధిలో తాగునీటి సమస్యను వార్డు నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టి నూతన నీటి బోరును ఏర్పాటు చేశారు.నూతన బోరు ఏర్పాటుతో తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన వార్డు నాయకుడు అల్తాఫ్ హుస్సేన్‌కు, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు, బోరు ఏర్పాటుకు సహకరించిన మున్సిపల్ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాల సుబ్బయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ, పట్టణ కార్యదర్శి షేక్ హుస్సేన్ పీరా, 101వ బూత్ ఇన్‌చార్జ్ కమాల్ భాషా, ఇందిరమ్మ కాలనీ ఇన్‌చార్జ్ పీరయ్య, ఐటీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.ప్రజల సమస్యలను స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఈ సందర్భంగా స్థానికులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!