ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఓటర్ల జాబితా సవరణపై వామపక్ష ప్రజాసంఘాల ఆందోళన

ఓటర్ల జాబితా సవరణపై వామపక్ష ప్రజాసంఘాల ఆందోళన

📰 Generate e-Paper Clip

 

–గాంధీ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరులో రాస్తారోకో

 

సలాం   ప్రొద్దుటూరు:

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరులో వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, అక్కడి నుంచి విజయ్‌కుమార్ సర్కిల్‌ వరకు ర్యాలీగా వెళ్లి రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా సీపీఎం పట్టణ  కార్యదర్శి సత్యనారాయణ, సీపీఐ నాయకుడు రామయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీ సంఖ్యలో పేర్లు తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యతను నిర్ధారించాలని డిమాండ్ చేశారు.వారి ఆరోపణల ప్రకారం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) ప్రక్రియలో దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాల నుంచి తొలగించబడినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయాన్ని వారు ప్రస్తావించారు.పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి లక్షలాది పేర్లపై వివాదం నెలకొన్న నేపథ్యంలో, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా పారదర్శకమైన విధానాన్ని పాటించాలని వారు డిమాండ్ చేశారు. ఓటర్ల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.అలాగే ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు, ఎన్నికల సాంకేతిక వ్యవస్థపై పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు.

 

రేషన్ కార్డుదారులకు 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలి

–ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ డిమాండ్

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజా సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు తీవ్ర భారంగా మారుతున్నాయని అన్నారు. పెరుగుతున్న ధరల నియంత్రణతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కల్పించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరారు.నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.రేషన్ కార్డుదారులకు 14 రకాల నిత్యావసర సరుకులను ప్రభుత్వం తక్షణమే రేషన్ ద్వారా అందించే విధానాన్ని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి సుబ్బరాయుడు, సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు బి. విజయకుమార్, పకీరయ్య, బాబు, కాంగ్రెస్ నాయకులు నజీర్ అహ్మద్, జిలాన్ భాష, మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు చంటి, కోశాధికారి రాఘవ, చిన్న కార్తీక్, డీవైఎఫ్ఐ అధ్యక్షుడు మేరీ బాబు, సృజన, శ్రీనివాసరెడ్డి, ఐలు నాయకురాలు హరిత, ఎంపీజే నాయకులు సలీం, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు శేఖర్, మురళిమాల మహానాడు నాయకులు భాస్కర్, మోహన్, మురళి, ఇమ్మానుయేల్, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం, ఐద్వా ప్రొద్దుటూరు పట్టణ కార్యదర్శి జి. ప్రేమ, అధ్యక్షురాలు విజయకుమారి, లక్ష్మీదేవి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!