మహబూబ్‌నగర్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం
–ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చొరవతో నూతన నీటి బోరు ఏర్పాటు సలాం ప్రొద్దుటూరు – మైదుకూరు: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్‌నగర్ వీధిలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రత్యేక చొరవతో స్థానికంగా నూతన నీటి బోరును ఏర్పాటు చేశారు.మహబూబ్‌నగర్ వీధిలో తాగునీటి సమస్యను వార్డు నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు....