ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ చట్టాలపై అవగాహన సదస్సు

వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ చట్టాలపై అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

 సలాం  ప్రొద్దుటూరు:

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA), న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్  కే. సత్యకుమారి సూచనలతో స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సెల్  ఏ. లక్ష్మీదేవి, అడ్వకేట్  కె.వి. చంద్రహాస్ పాల్గొని వృద్ధులకు సీనియర్ సిటిజన్స్‌కు సంబంధించిన చట్టాలు, వారికి కల్పించబడిన హక్కులు, న్యాయ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.అలాగే NALSA 2024 పథకాలు, ఉచిత న్యాయ సహాయం పొందే విధానం, లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నంబర్ 15100 తదితర సేవల గురించి వివరించారు. అవసరమైన వారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమం మేనేజర్  కె. రఘునాథ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!