ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మైదుకూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మైదుకూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

 

 

–అమ్మవారి శాలలో మహాత్మా గాంధీకి ఘన నివాళులు

 

సలాం ప్రొద్దుటూరు –మైదుకూరు:

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మైదుకూరులోని అమ్మవారి శాలలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సభ, ఆర్యవైశ్య యువజన సంఘం, కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, ఆవోపా కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ అనుసరించిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఐక్యత, సేవాభావం, దేశభక్తిని మరింత పెంపొందించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

యెలిశెట్టి వెంకట గురు ప్రసాద్‌కు ఘన సన్మానం

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ టూరిజం విభాగం కమిటీ వైస్ చైర్మన్‌గా నియమితులైన మైదుకూరుకు చెందిన యెలిశెట్టి వెంకట గురు ప్రసాద్‌ను ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. మైదుకూరుకు చెందిన వ్యక్తికి రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యత లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. టూరిజం విభాగం ద్వారా సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.గాంధీ జయంతి వేడుకలతో పాటు సన్మాన కార్యక్రమాన్ని ఒకే వేదికపై నిర్వహించడంతో అమ్మవారి శాలలో సందడి నెలకొంది.కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బల్లాని చెన్నకేశవ ప్రసాద్, దొంతు సుబ్రహ్మణ్యం, కోటా అశోక్ కుమార్, యెలిశెట్టి వెంకట గురు ప్రసాద్, దొంతు వెంకట సుబ్బయ్య, దరిశి శ్రీనివాసులు, సందిపూటి సతీష్ కుమార్, పుట్ట శివ, పుట్ట సాయి, తులసి సత్యసాయి, శంకురి వెంకటరమణ, మల్లెముల పెద్ద పుల్లయ్య, ఇమ్మిడిశెట్టి సతీష్ బాబు, కర్మలపూడి రెడ్డి భార్గవ్, మాలెపాటి నవీన్, కొప్పరపు సుబ్బారావు తదితరులతో పాటు ఆర్యవైశ్య యువత, వాసవి క్లబ్ సభ్యులు, ఆవోపా కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!