ఎల్‌నినో ప్రభావాలపై అప్రమత్తతే పశువుల రక్షణకు మార్గం

–రాజుపాలెంలో రైతులకు పశువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం –నీరు, నీడ, పశుగ్రాసం, గాలి ప్రసరణపై ప్రత్యేక సూచనలు సలాం ప్రొద్దుటూరు –  రాజుపాలెం: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి పశువులను రక్షించేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్య నిపుణులు సూచించారు. పశువుల ఆరోగ్యం, పశుగ్రాసం, నీటి నిర్వహణ, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు అవగాహన కల్పించేందుకు పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో DRDA రాజుపాలెం సహకారంతో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 38 మంది రైతులు...