ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్‌కు ‘కోట్ల’ కళ!

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్‌కు ‘కోట్ల’ కళ!

📰 Generate e-Paper Clip

 

–₹1.85 కోట్లకు గుత్త హక్కు.. దసరా నుంచి 45 రోజుల పాటు వినోద సందడి

 

–ప్లాస్టిక్‌కు పూర్తిగా నో.. భద్రతపై మున్సిపల్‌ అధికారుల ప్రత్యేక దృష్టి

 

సలాం   ప్రొద్దుటూరు:

దసరా పండుగను పురస్కరించుకుని ప్రొద్దుటూరులో నిర్వహించనున్న ఎగ్జిబిషన్‌కు భారీ స్పందన లభించింది. అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో దసరా నవరాత్రుల ప్రారంభం నుంచి 45 రోజుల పాటు ఎగ్జిబిషన్‌ నిర్వహించేందుకు గుత్త హక్కు కల్పించే ప్రక్రియలో భాగంగా సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో బహిరంగ వేలం, బాక్స్‌ టెండర్‌ నిర్వహించారు.కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో జరిగిన వేలం ప్రక్రియలో మొత్తం 10 మంది గుత్తదారులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌ గుత్త హక్కుకు **రూ.1.62 కోట్లను సర్కారు వారి పాట (Upset Price)**గా నిర్ణయించారు. బహిరంగ వేలంలో  ఎం. శివకుమార్‌ రూ.1,69,10,000కు అత్యధికంగా పాట పాడారు.అనంతరం నిర్వహించిన బాక్స్‌ టెండర్‌లోనూ శివకుమార్‌ అత్యధికంగా రూ.1,85,00,070ను కోట్‌ చేశారు. బహిరంగ వేలం, బాక్స్‌ టెండర్‌ ప్రక్రియలను మున్సిపల్‌ నిబంధనల ప్రకారం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జేసీ డా నిధి మీనా అనుమతితో అత్యధిక మొత్తాన్ని కోట్‌ చేసిన శివకుమార్‌కు గుత్త హక్కును ఖరారు చేసినట్లు కమిషనర్‌ వెల్లడించారు.

45 రోజుల పాటు వినోద సందడి

దసరా నవరాత్రుల ప్రారంభం నుంచి 45 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ అమ్యూజ్‌మెంట్‌ రైడ్స్‌, పిల్లల కోసం ప్రత్యేక వినోద కార్యక్రమాలు, ఇతర ఆకర్షణలను ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ అధికారులు నిర్వాహకులకు సూచించారు.

ప్రవేశ రుసుములు ఇలా..

ఎగ్జిబిషన్‌లో పిల్లలకు రూ.30, పెద్దలకు రూ.40 ప్రవేశ రుసుము, దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేయనున్నారు. అమ్యూజ్‌మెంట్‌ వస్తువులకు రూ.100, పిల్లల వస్తువులకు రూ.50గా ధరలు నిర్ణయించారు. పార్కింగ్‌ రుసుముగా ద్విచక్ర వాహనాలకు రూ.10, నాలుగు చక్రాల వాహనాలకు రూ.20గా ఖరారు చేశారు.

ప్లాస్టిక్‌కు పూర్తిగా నిషేధం

ప్లాస్టిక్‌ రహిత ప్రొద్దుటూరు కార్యక్రమంలో భాగంగా ఎగ్జిబిషన్‌ ప్రాంగణంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. నిర్వాహకులు, వ్యాపారులు, సందర్శకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

భద్రతకు అధిక ప్రాధాన్యం

ఎగ్జిబిషన్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున అగ్ని ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ ఆదేశించారు. విద్యుత్‌ సదుపాయాలు, అమ్యూజ్‌మెంట్‌ పరికరాలు, అత్యవసర మార్గాలు, అగ్నిమాపక పరికరాలు తదితర అంశాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ మంజునాథ గౌడ్‌, ఆర్‌ఐ విజయ్‌, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!