ePaper
Monday, September 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్రీయ ఏక్తా దివస్‌ సందర్భంగా వ్యాసరచన పోటీలు

రాష్ట్రీయ ఏక్తా దివస్‌ సందర్భంగా వ్యాసరచన పోటీలు

📰 Generate e-Paper Clip

–వైవిధ్యంలో ఏకత్వం.. సర్దార్‌ పటేల్‌ సేవలపై విద్యార్థులకు అవగాహన

 

–120 మంది విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం.. విజేతలకు నగదు బహుమతులు, ప్రతి విద్యార్థికి స్టీల్‌ వాటర్‌ బాటిల్‌

 

సలాం   ప్రొద్దుటూరు:

 

రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని ప్రొద్దుటూరు మండల పరిధిలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో 9వ, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఘనంగా నిర్వహించారు. పద్మశాలీయ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఏఎస్పీ శ్రీ విభూ కృష్ణ ఐపీఎస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రోటరీ క్లబ్‌ ప్రొద్దుటూరు అధ్యక్షుడు కొవ్వూరు రమేష్‌రెడ్డి సహకారంతో “యూనిటీ ఇన్‌ డైవర్సిటీ”, “సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సేవలు” అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 120 మంది విద్యార్థినీ విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి తరగతికి ప్రథమ బహుమతి రూ.1,500, ద్వితీయ బహుమతి రూ.1,000, తృతీయ బహుమతి రూ.500 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. పోటీలకు హాజరైన ప్రతి విద్యార్థికి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాటర్‌ బాటిల్‌తో పాటు ప్రశంసాపత్రం అందించారు.ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలను డాక్టర్‌ శ్రీ సోమ లక్ష్మీ నరసయ్య, రొటేరియన్‌ ఉట్టి నాగశయనం, రోటరీ ఐ హాస్పిటల్‌ సెక్రటరీ బేపారి జాకీర్‌ అహ్మద్‌, గండ్లూరు శ్రీధర్‌ శర్మ కుమార్తె గండ్లూరు సాయి లక్ష్మీ హర్షిత అందించారు.కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ సెక్రటరీ శ్రీధర్‌ శర్మ, వైస్‌ ప్రెసిడెంట్‌ కొవ్వూరు రవికుమార్‌రెడ్డి, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ బాలసూర్యరావు, డాక్టర్‌ సునీల్‌, ఏజీకే మల్లికార్జున, రోటరీ ఐ హాస్పిటల్‌ ప్రెసిడెంట్‌ ఎంవీఎన్‌ ప్రభు, అగ్గారపు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, రొటేరియన్‌ శ్రీరాముల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.అలాగే వన్‌టౌన్‌ సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ మైనుద్దీన్‌, ఎస్‌ఐ సంజీవరెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని, ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడటంతో పాటు భవిష్యత్తులో మంచి వ్యవస్థాపకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఈఓ జీఎస్‌ఎల్‌వీఎస్‌ శివప్రసాద్‌ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యత, దేశభక్తి వంటి విలువలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!