ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్‌కు ‘కోట్ల’ కళ!
–₹1.85 కోట్లకు గుత్త హక్కు.. దసరా నుంచి 45 రోజుల పాటు వినోద సందడి –ప్లాస్టిక్‌కు పూర్తిగా నో.. భద్రతపై మున్సిపల్ అధికారుల ప్రత్యేక దృష్టి సలాం ప్రొద్దుటూరు: దసరా పండుగను పురస్కరించుకుని ప్రొద్దుటూరులో నిర్వహించనున్న ఎగ్జిబిషన్‌కు భారీ స్పందన లభించింది. అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో దసరా నవరాత్రుల ప్రారంభం నుంచి 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు గుత్త హక్కు కల్పించే ప్రక్రియలో భాగంగా సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం, బాక్స్ టెండర్ నిర్వహించారు.కమిషనర్ తూతిక...