ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పేదల వైద్యానికి భరోసా.. 53 కుటుంబాలకు రూ.39.27 లక్షల CMRF సాయం

పేదల వైద్యానికి భరోసా.. 53 కుటుంబాలకు రూ.39.27 లక్షల CMRF సాయం

📰 Generate e-Paper Clip

–ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

 

–అత్యవసర వైద్యంలో పేద కుటుంబాలకు CMRF అండగా నిలుస్తోంది: ఎమ్మెల్యే

 

సలాం ప్రొద్దుటూరు:

అనారోగ్యం, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) అండగా నిలుస్తోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు.ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన 32వ విడత ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 53 మంది లబ్ధిదారులకు రూ.39,27,232 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అవసరమైన అర్హులైన కుటుంబాలు CMRF అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీఎస్ ముక్తియార్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి, టీడీపీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!