ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అవినీతిపై ప్రజా చైతన్యం.. శివాలయం సెంటర్‌లో MPJ సంతకాల సేకరణ

అవినీతిపై ప్రజా చైతన్యం.. శివాలయం సెంటర్‌లో MPJ సంతకాల సేకరణ

📰 Generate e-Paper Clip

 

సలాం    ప్రొద్దుటూరు:

అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ)–ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌లో ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు కొనసాగుతున్న ఈ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాన్ని MPJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. “ప్రజాధనం–ప్రజల హక్కు.. అవినీతిని ప్రశ్నిద్దాం–జవాబుదారితనం సాధిద్దాం” అనే నినాదంతో ప్రజల నుంచి సంతకాలను సేకరించారు.ఈ సందర్భంగా షేక్ సలీం, MPJ రాయలసీమ ఇన్‌చార్జి అయూబ్ ఖాన్ మాట్లాడుతూ ప్రజాధనం ప్రజల సొమ్మని, అది పారదర్శకంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అవినీతిని ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని పేర్కొన్నారు.ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటానికి ప్రజల్లో మరింత చైతన్యం అవసరమన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించేందుకు ప్రజలు తమ గొంతును వినిపించాలని పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజల భాగస్వామ్యంతో MPJ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, సంతకాల సేకరణ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.కార్యక్రమంలో MPJ జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్రి, పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ బాష, కార్యదర్శి మహమ్మద్ రఫీ, కోశాధికారి ఇస్మాయిల్తో పాటు నాయకులు ముక్తాయర్, లాల్ బాష, ఫర్హాన్, అన్వర్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తమ మద్దతు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!