దస్తగిరిపేటలో ఆధ్యాత్మిక సందడి.. ఘనంగా గంధం–పెద్ద జెండా మహోత్సవం

సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని దస్తగిరిపేట వీధిలో ఉన్న  హజరత్ మహబూబ్ సుబహాని రహ్మతుల్లాహి అలైహి (దస్తగిరిస్వామి జెండాచెట్టు) దర్గా గంధం–పెద్ద జెండా మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద జెండాలు, చిన్న జెండాలు, గంధం, పూలను  అలీబాష ఖాద్రి అల్ చిష్టి  నివాసం నుంచి భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చారు.దస్తగిరిపేట నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు జిన్నా రోడ్డు, మైదుకూరు రోడ్డు, పుట్టపర్తి సెంటర్ మీదుగా సాగి తిరిగి దర్గా వద్దకు చేరుకుంది. ఊరేగింపు మార్గమంతా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో...