ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు పక్కాగా కల్పించాలి

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు పక్కాగా కల్పించాలి

📰 Generate e-Paper Clip

 

 

–ప్రతి కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.. 25లోపు పూర్తి వివరాలు అందించాలి

 

–దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పటిష్టం చేయాలి

 

సలాం  ప్రొద్దుటూరు:

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రొద్దుటూరు పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, ర్యాంపులు తదితర సౌకర్యాలను పక్కాగా ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపల్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసులు ఆధ్వర్యంలో అధికారులు రెండు రోజులపాటు అన్ని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకా కల్పించాల్సిన వసతులు, గుర్తించిన లోపాలపై సమగ్ర నివేదికను సెప్టెంబర్ 25లోపు అందజేయాలని ఆదేశించారు.

దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు

ప్రత్యేకంగా దివ్యాంగ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, తాగునీరు, టాయిలెట్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా సాగేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పటిష్టం

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పటిష్టంగా చేపట్టాలని మున్సిపల్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసులకు కమిషనర్ ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో భద్రత, విద్యుత్ తదితర అవసరమైన వసతులను పరిశీలించి ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సెన్సిటివ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ స్పష్టం చేశారు.

గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అవసరమైన చర్యలను తక్షణమే ప్రారంభించి, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!