ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అవినీతిని ప్రశ్నిద్దాం.. జవాబుదారితనం సాధిద్దాం

అవినీతిని ప్రశ్నిద్దాం.. జవాబుదారితనం సాధిద్దాం

📰 Generate e-Paper Clip

 

 

–సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం

 

–ప్రొద్దుటూరు ప్రెస్‌క్లబ్‌లో కరపత్రాలు విడుదల చేసిన MPJ

 

సలాం   ప్రొద్దుటూరు:

అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించి, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించాలనే లక్ష్యంతో మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ)–ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించే కరపత్రాలను సోమవారం ప్రొద్దుటూరు ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేశారు.

 

ప్రజలు ప్రశ్నించే హక్కును వినియోగించుకోవాలి

 

ప్రభుత్వ సేవలు పొందడంలో జరుగుతున్న జాప్యం, అక్రమ వసూళ్లు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై ప్రజలు ప్రశ్నించే హక్కును వినియోగించుకోవాలని MPJ పిలుపునిచ్చింది. అవినీతిని కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారితనానికి సంబంధించిన అంశంగా చూడాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు.“అవినీతిని ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు.. జవాబుదారితనం కోరడం ప్రజాస్వామ్య బాధ్యత” అనే సందేశంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలి

సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు నిర్వహించే అవగాహనా కార్యక్రమాల్లో ప్రజలు, యువత, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొని పారదర్శక పాలనపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తమ వంతు పాత్ర పోషించాలని MPJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం కోరారు.అవినీతికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో అవగాహన పెంపొందించడం, ప్రజలకు తమ హక్కులు–బాధ్యతలపై చైతన్యం కల్పించడం కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో MPJ జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ ఉమ్రి, పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ బాష, కార్యదర్శి మహమ్మద్ రఫీ, మీడియా కార్యదర్శి ఫర్హాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!