పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు పక్కాగా కల్పించాలి
–ప్రతి కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.. 25లోపు పూర్తి వివరాలు అందించాలి –దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పటిష్టం చేయాలి సలాం ప్రొద్దుటూరు: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రొద్దుటూరు పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, ర్యాంపులు తదితర సౌకర్యాలను పక్కాగా ఏర్పాటు...