ePaper
Monday, September 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్లాస్టిక్ ఫ్రీ ప్రొద్దుటూరే లక్ష్యం

ప్లాస్టిక్ ఫ్రీ ప్రొద్దుటూరే లక్ష్యం

📰 Generate e-Paper Clip

 

 

–అడ్వైజరీ కమిటీ 3వ సమావేశంలో కీలక నిర్ణయాలు

 

–ప్రతి శనివారం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని నిర్ణయం

 

సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్లాస్టిక్ ఫ్రీ ప్రొద్దుటూరు అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి శనివారం కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్లాస్టిక్ వినియోగంపై పరిస్థితులను పరిశీలించనున్నారు.మూడవ శనివారం సందర్భంగా శనివారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో ప్లాస్టిక్ ఫ్రీ ప్రొద్దుటూరు అడ్వైజరీ కమిటీ 3వ సమావేశం నిర్వహించారు. అడ్వైజరీ కమిటీ గౌరవ ప్యానల్ చైర్మన్ డా. వరుణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణంలో ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాపారులు, ప్రజలు, వివిధ వర్గాల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ నివారణ చర్యలను విస్తృతం చేయడంపై చర్చించారు.సమావేశంలో సభ్యులు పలు విలువైన సూచనలు, సలహాలను అందించారు. ప్లాస్టిక్ నిషేధం అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు. ప్రతి శనివారం కమిటీ సభ్యులు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్లాస్టిక్ వినియోగాన్ని పరిశీలించడంతో పాటు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.

 

ప్రజలు, వ్యాపారులు సహకరించాలి

 

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు నిర్మాణం కేవలం అధికారుల చర్యలతో సాధ్యం కాదని, ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించి భాగస్వాములు కావాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణ పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.సమావేశంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు తూతిక శ్రీనివాస విశ్వనాథ్, బి. మారుతీ ప్రసాద్, కే. ధనలక్ష్మి, జి. శివ ప్రసాద్, ఎం. నీరజ, జె. రామ సుబ్బయ్య, కె. రమేష్ రెడ్డి, ఎస్. అయూబ్ ఖాన్, ఎం. శ్రీనివాసులు, ఎస్. మహాలక్ష్మి, ఎన్. దస్తగిరి, కె. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!