ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపలో కొత్త టీడీపీ జిల్లా కార్యాలయానికి శ్రీకారం

కడపలో కొత్త టీడీపీ జిల్లా కార్యాలయానికి శ్రీకారం

📰 Generate e-Paper Clip

 

–నూతన కార్యాలయ స్లాబ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు –కడప:

కడపలో నూతనంగా నిర్మించనున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జిల్లా కార్యాలయ నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, నాయకులు–కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నూతన జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు నాయకులు తెలిపారు. పార్టీ సమావేశాలు, కార్యాచరణ కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయానికి ఈ కార్యాలయం వేదికగా నిలవనుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీవుల్లా, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్, జిల్లా పార్లమెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ నజీముద్దీన్, మన్నూర్ అక్బర్, జనార్ధన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నూతన కార్యాలయం పార్టీ శ్రేణులకు మరింత అందుబాటులో ఉంటుందని, ప్రజా సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావడంతో పాటు కార్యకర్తల సమన్వయానికి ఉపయోగపడుతుందని తెలిపారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!