ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనారోగ్యంతో బాధపడుతున్న సట్టెన్నకు వాల్మీకి చేయూత

అనారోగ్యంతో బాధపడుతున్న సట్టెన్నకు వాల్మీకి చేయూత

📰 Generate e-Paper Clip

 

–రూ.5 వేల ఆర్థిక సాయం అందజేత

 

సలాం ప్రొద్దుటూరు –మైలవరం:

అనారోగ్యంతో బాధపడుతున్న మైలవరం పట్టణంలోని పొట్టిపాడు రోడ్డుకు చెందిన చిన్ననారన్నగారి సట్టెన్న (వెంకటరాముడు)ను వాల్మీకి చేయూత సేవా సంస్థ ప్రతినిధులు సోమవారం పరామర్శించారు. ఆయన స్వగృహానికి వెళ్లిన ప్రతినిధులు సట్టెన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా వాల్మీకి చేయూత సేవా సంస్థ తరఫున బయపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి సహకారంతో రూ.5,000 ఆర్థిక సహాయాన్ని సట్టెన్నకు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తమ వంతు సహకారం అందించడం ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో చిన్ననారన్నగారి రఘునాథ్, నల్లబోతుల నరసింహులు, నల్లబోతుల మధు, నల్లబోతుల మద్దిలేటి, చిన్నవీరన్నగారి సుబ్బయ్య, చిన్నవీరన్నగారి సుమంత్ పాల్గొన్నారు. వాల్మీకి చేయూత సేవా సంస్థ అందించిన సహాయంపై పలువురు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!