అనారోగ్యంతో బాధపడుతున్న సట్టెన్నకు వాల్మీకి చేయూత
–రూ.5 వేల ఆర్థిక సాయం అందజేత సలాం ప్రొద్దుటూరు –మైలవరం: అనారోగ్యంతో బాధపడుతున్న మైలవరం పట్టణంలోని పొట్టిపాడు రోడ్డుకు చెందిన చిన్ననారన్నగారి సట్టెన్న (వెంకటరాముడు)ను వాల్మీకి చేయూత సేవా సంస్థ ప్రతినిధులు సోమవారం పరామర్శించారు. ఆయన స్వగృహానికి వెళ్లిన ప్రతినిధులు సట్టెన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వాల్మీకి చేయూత సేవా సంస్థ తరఫున బయపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి సహకారంతో రూ.5,000 ఆర్థిక సహాయాన్ని సట్టెన్నకు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు...