

–టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు గ్రామం కుమ్మరి వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీరామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, హోమ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రొద్దుటూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, కల్లూరు గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ నిరంజన్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు హాజరయ్యారు.వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చల్లా రాజగోపాల్ యాదవ్ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణం సందర్భంగా సుమారు 1500 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు చల్లా రాజగోపాల్ యాదవ్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం కాలమాపణ గ్రామంలోని రంగమ్మతల్లి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు.

