రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

–ఉత్తమ సేవలందించిన 8 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం   సలాం   ప్రొద్దుటూరు: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తున్నారని రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు అధ్యక్షుడు కొవ్వూరు రమేష్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 5న రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు ఐ హాస్పిటల్స్‌ సభా భవనంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.రోటరీ ఐ హాస్పిటల్‌, ఇన్నర్‌ వీల్‌ సభ్యుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యా...