ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తొండూరులో డిజిటల్ సేవలకు కొత్త బాట

తొండూరులో డిజిటల్ సేవలకు కొత్త బాట

📰 Generate e-Paper Clip

 

–ప్రజలకు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యం: జిల్లా మేనేజర్ సిగా సుబ్రహ్మణ్యం

 

సలాం ప్రొద్దుటూరు –  తొండూరు:

గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేట్ డిజిటల్ సేవలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) సేవలను విస్తరిస్తున్నట్లు కడప జిల్లా కామన్ సర్వీస్ సెంటర్ మేనేజర్ సిగా సుబ్రహ్మణ్యం తెలిపారు.తొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ల వెరిఫికేషన్ ప్రక్రియను మంగళవారం ఆయన పూర్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల పనితీరు, మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్ సౌకర్యం, అవసరమైన పరికరాలు, ప్రజలకు అందిస్తున్న ఆన్‌లైన్ సేవలను ఆయన పరిశీలించారు.గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతి చిన్న ప్రభుత్వ సేవ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా స్థానికంగానే సేవలు పొందే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆధార్, పాన్ కార్డు సేవలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు, వివిధ ధృవపత్రాల కోసం దరఖాస్తులు, బ్యాంకింగ్, బీమా తదితర సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.వెరిఫికేషన్ సందర్భంగా కేంద్రాల నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, నిర్వాహకులు పారదర్శకతతో, నాణ్యతతో సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రజలకు సేవలపై సరైన సమాచారం అందించాలని స్పష్టం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత మందికి చేరువవుతాయని ఆయన అన్నారు. నిబంధనలకు అనుగుణంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న కామన్ సర్వీస్ సెంటర్లను వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలిపారు.తొండూరు మండలంలో CSC కేంద్రాల ద్వారా మరిన్ని డిజిటల్ సేవలు అందుబాటులోకి రానుండటంతో రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, గ్రామీణ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకురావడంలో కామన్ సర్వీస్ సెంటర్లు కీలక వారధిగా నిలుస్తాయని సిగా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!