ePaper
Monday, October 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

📰 Generate e-Paper Clip

 

–నిరుద్యోగ భృతి, ఉద్యోగాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం

 

–ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘యూత్ మీట్‌అప్’

 

సలాం ప్రొద్దుటూరు:

ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు స్పష్టమైన సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. యువత హక్కులు, ప్రభుత్వ జవాబుదారీతనంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రొద్దుటూరులో ‘YSRCP Youth Meet Up – యువత హక్కు–ప్రభుత్వానికి జవాబుదారీతనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.దొరసానిపల్లెలోని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  నివాసంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన, యువ నాయకులు రాచమల్లు రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బండి వినీత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా యువతతో సమావేశమైన వైఎస్సార్‌సీపీ నాయకులు.. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందిస్తామని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి, యువత భవిష్యత్‌కు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించాలని నాయకులు కోరారు. హామీల అమలు కోసం యువత ఐక్యంగా తమ హక్కుల కోసం ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ యువ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. యువత సమస్యలను తెలుసుకుని, వాటిపై భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించినట్లు నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!