ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఎడిటోరియల్స్థానిక వ్యాపారి బలపడితేనే.. ప్రాంతం బలపడుతుంది!

స్థానిక వ్యాపారి బలపడితేనే.. ప్రాంతం బలపడుతుంది!

📰 Generate e-Paper Clip

  

–కార్పొరేట్ సంస్థలను అడ్డుకుంటాం.. స్థానిక వ్యాపారులకు జనసేన అండగా ఉంటుంది

–స్థానిక వ్యాపారంతోనే ఉపాధి, ఆర్థికాభివృద్ధి సాధ్యం — జనసేన నాయకుడు మాదాసు మురళీ

 సలాం   ప్రొద్దుటూరు:

స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారానే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి బలోపేతం అవుతాయని జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళీ అన్నారు. స్థానిక చిన్న, చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు జనసేన పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.స్థానిక నందిని ప్రాంతంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాసు మురళీ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు సుమారు 2.50 లక్షల జనాభా కలిగిన పట్టణమని, ఎన్నో ఏళ్లుగా స్థానిక వ్యాపారులు ప్రజల నమ్మకాన్ని సంపాదించుకుంటూ బంగారం, పట్టు వస్త్రాలు, చిల్లర వ్యాపారాలు తదితర రంగాల్లో నిజాయితీగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక వ్యాపారులను ఆర్థికంగా దెబ్బతీసే విధంగా భారీ కార్పొరేట్ సంస్థలు పట్టణంలోకి వస్తే, దాని ప్రభావం చిన్న వ్యాపారుల జీవనోపాధిపై పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వ్యాపారులు బలపడితేనే స్థానిక ఉపాధి పెరుగుతుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

“కార్పొరేట్ సంస్థలను అడ్డుకుంటాం”

స్థానిక చిన్న, చిరు వ్యాపారుల ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా కార్పొరేట్ సంస్థల విస్తరణను జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందని మాదాసు మురళీ తెలిపారు. అవసరమైతే స్థానిక వ్యాపారుల ప్రయోజనాల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.“స్థానిక వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బంది కలిగించే కార్పొరేట్ సంస్థలను అడ్డుకునేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది” అని ఆయన అన్నారు. ప్రజలు కూడా స్థానిక వ్యాపారులను ప్రోత్సహించి, వారి వద్దే కొనుగోళ్లు చేయాలని కోరారు.

రాచమల్లు వ్యాఖ్యలపై విమర్శలు

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్థానిక వ్యాపారులకు మద్దతుగా మాట్లాడటంపై మాదాసు మురళీ విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ వ్యాపార సంస్థలకు అనుమతులు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు స్థానిక వ్యాపారులకు మద్దతు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.“స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్థానిక వ్యాపారులకు మద్దతు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో కార్పొరేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చినప్పుడు స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను ఎందుకు పట్టించుకోలేదు?” అని ప్రశ్నించారు.

చిన్న వ్యాపారులే ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక

చిన్న, చిరు వ్యాపారులే స్థానిక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని మాదాసు మురళీ పేర్కొన్నారు. వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలిగినా జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.వ్యాపారులకు అనవసరమైన ఒత్తిళ్లు, ఇబ్బందులు లేకుండా అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉపాధి, ఆదాయ అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.

వ్యాపారుల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం

స్థానిక వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అండగా నిలుస్తామని మాదాసు మురళీ తెలిపారు.“స్థానిక వ్యాపారి బలపడితేనే మన ప్రాంతం బలపడుతుంది. స్థానికుల ఉపాధి, వ్యాపారుల జీవనోపాధి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు జనసేన పార్టీ నిరంతరం అండగా ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.స్థానిక వ్యాపారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ కార్పొరేట్ సంస్థలు వచ్చినా వాటిని అడ్డుకునేందుకు పోరాటం చేస్తామని మాదాసు మురళీ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!