ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

 

–అంగన్‌వాడి చిన్నారులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

 

సలాం   ప్రొద్దుటూరు:

కడప జిల్లా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కల్లూరు గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కల్లూరు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సుమారు 70 మంది చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పార్లమెంటరీ సెక్రటరీ కల్లూరు నాగేంద్రరెడ్డి పాల్గొని చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను అందజేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో కేక్‌ కట్‌ చేసి చిన్నారులతో కలిసి ఎంపీ అవినాష్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారులతో నాగేంద్రరెడ్డి ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారికి కేక్‌ తినిపించి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంతో నిర్వహించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో కల్లూరు గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!