ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeజాతియంపవిత్ర ముయే ముబారక్ దర్శనానికి పోటెత్తిన జనసందోహం..

పవిత్ర ముయే ముబారక్ దర్శనానికి పోటెత్తిన జనసందోహం..

📰 Generate e-Paper Clip

మిలాద్ ఉన్ నబీ ﷺ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు

కులమతాలకు అతీతంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు

సలాం ప్రొద్దుటూరు గుల్బర్గా, (కర్ణాటక):

మిలాద్ ఉన్ నబీ ﷺ పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా పట్టణంలో హజరత్ సయ్యదిన మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
పవిత్ర ముయే ముబారక్ దర్శన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పవిత్ర ముయే ముబారక్ దర్శనం కోసం కర్ణాటకతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కులమత భేదాలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రవక్త మహమ్మద్ ﷺ వారి జన్మదినాన్ని భక్తి ప్రపత్తులతో స్మరించుకున్నారు.

ఆధ్యాత్మిక శోభతో ఘనమైన కార్యక్రమం

కర్నూలులోని హజ్రత్ సయ్యద్ షా బుర్హాన్‌దీన్ చిష్తీ ఉల్ ఖాద్రీ దర్గా పీఠాధిపతి సయ్యద్ షా అహ్మద్ పాషా హుస్సైనీ చిష్తీ ఉల్ ఖాద్రీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ ﷺ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్ర ముయే ముబారక్‌ను భక్తులకు దర్శనార్థం ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.ఈ
కార్యక్రమంలో మౌలానా హజ్రత్ సయ్యద్ అబ్దుల్ రౌఫ్ అష్రఫీ పాల్గొన్నారు. అలాగే మెహబూబ్‌నగర్ నుంచి బుర్దా షరీఫ్ , నాత్-ఎ-షరీఫ్ చదివేందుకు బృందం హాజరయ్యారు. నాత్-ఎ-షరీఫ్ తో కార్యక్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక భక్తిభావంతో నిండిపోయింది.

ఫజర్ నమాజ్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు

పవిత్ర ముయే ముబారక్ జియారత (దర్శనం ) ఫజర్ నమాజ్ వరకు చూపించారు.అనంతరం ప్రత్యేక దువాలు, ప్రార్థనలు నిర్వహించి, భక్తులకు కల్పించారు. పవిత్ర అవశేషాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించి, తమ కుటుంబాలు, సమాజం శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పీఠాధిపతి కుమారులు హాఫిజ్ సయ్యద్ షా రాగిబ్ పాషా హుస్సేన్ ఖాద్రీ, సయ్యద్ షా కాశిఫ్ పాషా ఖాద్రీ లు, పలువురు అలిములు ,మురీదులు తదితరులు పాల్గొని కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములయ్యారు.

కులమతాలకు అతీతంగా ఐక్యతకు ప్రతీకగా…

మిలాద్ ఉన్ నబీ ﷺ సందర్భంగా నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమం కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య సోదరభావం, ప్రేమ, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. వేలాది మంది ప్రజలు ప్రశాంతంగా కార్యక్రమంలో పాల్గొని పవిత్ర ముయే ముబారక్‌ను దర్శించుకున్నారు.
భక్తుల రాకతో కార్యక్రమ ప్రాంగణం జనసందోహంతో కిటకిటలాడింది. నాత్-ఎ-షరీఫ్, దువాలు, ప్రత్యేక ప్రార్థనలతో గుల్బర్గా ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మిలాద్ ఉన్ నబీ ﷺ సందేశమైన ప్రేమ, సోదరభావం, మానవతా విలువలను ప్రజల్లో చాటుతూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!