ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్“అల్లాహ్ దయతో ముస్లిం సమాజానికి పెద్ద కొడుకుగా ఉంటా”–రాచమల్లు

“అల్లాహ్ దయతో ముస్లిం సమాజానికి పెద్ద కొడుకుగా ఉంటా”–రాచమల్లు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

“అల్లాహ్‌ దయతో ముస్లిం సమాజానికి పెద్ద కొడుకుగా అండగా నిలుస్తానని, వారికి మేలు చేసే వరకు వెనుకడుగు వేయనని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం స్థానిక 22 వ వార్డు లోనీ హైదర్ ఖాన్ వీధి లో  వార్డుకు చెందిన మహమ్మద్ హుస్సేన్ (లక్ష్మీ సౌండ్స్), ఆయన సోదరులు, బంధుమిత్రులు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 22వ వార్డులో ప్రజాబలం ఉన్న మాబు హుస్సేన్ వైఎస్సార్‌సీపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.2011లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచిన మాజీ కో-ఆప్షన్ సభ్యుడు కటిక జాఫర్ వంటి నాయకులు ఈ వార్డులో పార్టీకి ఉన్న బలానికి ఉదాహరణగా నిలుస్తున్నారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.గత ఎన్నికల్లో తాను ఓటమి పాలైనప్పటికీ ముస్లిం ప్రజలు తనను ఆదరించి అండగా నిలిచారని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. తనపై చూపిన అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. మైనారిటీ లకు మేలు చేసే వరకు ప్రజాసేవ నుంచి వెనక్కి తగ్గనని హామీ ఇచ్చారు.తాజా చేరికలతో 22వ వార్డులో వైఎస్సార్‌సీపీ రాజకీయ బలం మరింత పెరిగిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!