సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు నగరంలోని ఇస్లాంపుర మసీదులో విద్యార్థులకు ప్రత్యేక ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నుంచి విచ్చేసిన బోధకులు విద్యార్థులకు ఖురాన్ మార్గదర్శకత్వం, సత్ప్రవర్తన, వ్యక్తిగత బాధ్యత, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఉత్తమ జీవనశైలిపై విలువైన సందేశాలను అందించారు.చదువులు, ఉద్యోగాలు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని, అయితే వ్యక్తిగా మంచి సద్బుద్ధి, నైతిక విలువలతో జీవించేందుకు ఖురాన్ చూపించే మార్గదర్శకత్వం అత్యంత ముఖ్యమని బోధకులు వివరించారు. జీవితంలో ఎదురయ్యే అనేక ప్రశ్నలకు ఖురాన్ ద్వారా మార్గదర్శకత్వం పొందవచ్చని తెలిపారు.విద్యార్థులు తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం పట్ల తమ బాధ్యతలను గుర్తించి, మంచి నడవడికతో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నగరంలోని సుమారు 50 మసీదుల నుంచి దాదాపు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చైతన్యం, మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఇస్లాంపుర్ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో AP స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. V.S. ముక్తియార్ మస్జిద్ అధ్యక్షుడిగా పాల్గొని కార్యక్రమానికి సహకరించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇటువంటి ఆధ్యాత్మిక, నైతిక బోధనా కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.
