ఇస్లాంపుర మసీదులో విద్యార్థులకు ఆధ్యాత్మిక బోధనలు

    సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నగరంలోని ఇస్లాంపుర మసీదులో విద్యార్థులకు ప్రత్యేక ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నుంచి విచ్చేసిన బోధకులు విద్యార్థులకు ఖురాన్ మార్గదర్శకత్వం, సత్ప్రవర్తన, వ్యక్తిగత బాధ్యత, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఉత్తమ జీవనశైలిపై విలువైన సందేశాలను అందించారు.చదువులు, ఉద్యోగాలు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని, అయితే వ్యక్తిగా మంచి సద్బుద్ధి, నైతిక విలువలతో జీవించేందుకు ఖురాన్ చూపించే మార్గదర్శకత్వం అత్యంత ముఖ్యమని బోధకులు వివరించారు. జీవితంలో ఎదురయ్యే అనేక ప్రశ్నలకు ఖురాన్ ద్వారా మార్గదర్శకత్వం పొందవచ్చని తెలిపారు.విద్యార్థులు తల్లిదండ్రులు,...