
సలాం ప్రొద్దుటూరు:
ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు 93వ బూత్ ఇన్‌చార్జ్ దుగ్గిరెడ్డి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు పాల్గొని, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత అంశాలను పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ప్రతినిధులు పాల్గొన్నారు.

