ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్శెట్టివారిపల్లిలో క్రీడా మైదానం అభివృద్ధికి శ్రీకారం

శెట్టివారిపల్లిలో క్రీడా మైదానం అభివృద్ధికి శ్రీకారం

📰 Generate e-Paper Clip

మైదుకూరు: మైదుకూరు పురపాలిక పరిధిలోని శెట్టివారిపల్లి గ్రామంలో క్రీడా మైదానం అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైదుకూరు ఎమ్మెల్యే  పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు, MEIL సహకారంతో గ్రామంలో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని యువత, విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, వారికి మెరుగైన క్రీడా వసతులు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి పనులను చేపట్టారు.

మైదానం అందుబాటులోకి వచ్చిన అనంతరం శెట్టివారిపల్లి యువత, విద్యార్థులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, పరుగు తదితర క్రీడల్లో సాధన చేసేందుకు మెరుగైన అవకాశం లభించనుంది. క్రీడల ద్వారా యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ, పోటీతత్వ స్ఫూర్తి పెంపొందించేందుకు ఈ వసతి దోహదపడనుంది.

శెట్టివారిపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా క్రీడా మైదానం అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు గ్రామస్థులు, యువత, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

యువతకు క్రీడా వసతులు – గ్రామాభివృద్ధికి మరో ముందడుగు

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!