ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఎడిటోరియల్🌟 ప్రొద్దుటూరు నుంచి ఫిన్లాండ్ వరకు... షేక్ జవహర్ మున్నీర్ విజయ ప్రస్థానం!

🌟 ప్రొద్దుటూరు నుంచి ఫిన్లాండ్ వరకు… షేక్ జవహర్ మున్నీర్ విజయ ప్రస్థానం!

📰 Generate e-Paper Clip

 

 

–రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నుంచి అంతర్జాతీయ శిక్షణకు ఎంపిక

 

సలాం  ప్రొద్దుటూరు:

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిగా సేవలందిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషి చేసిన షేక్ జవహర్ మున్నీర్ మరో అరుదైన ఘనత సాధించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఆమె తాజాగా ఫిన్లాండ్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్ (FLN) శిక్షణా కార్యక్రమానికి ఎంపికయ్యారు.

 

ప్రొద్దుటూరు లింగారెడ్డి కొట్టాలులోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న జవహర్ మున్నీర్‌కు ఫిన్లాండ్ శిక్షణకు ఎంపికైనట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. ఆగస్టు 15న ఫిన్లాండ్‌కు బయలుదేరనున్న ఆమె, ఆగస్టు 17 నుంచి 26 వరకు జరిగే శిక్షణా కార్యక్రమంలో పాల్గొననున్నారు.

 

29 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల్లో చోటు

 

ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం, అభ్యసన నైపుణ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎంపికైన 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొననుండగా, వారిలో ప్రొద్దుటూరుకు చెందిన షేక్ జవహర్ మున్నీర్ చోటు దక్కించుకోవడం విశేషం.

 

రాష్ట్ర అవార్డు నుంచి అంతర్జాతీయ వేదిక వరకు…

 

2025 సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న జవహర్ మున్నీర్, ఏడాది తిరగకముందే అంతర్జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక కావడం ఆమె ప్రతిభకు మరో గుర్తింపుగా నిలిచింది.

 

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ విద్యార్థుల అభ్యసన ప్రమాణాల మెరుగుదలకు చేస్తున్న కృషికి లభించిన ఈ గుర్తింపు ప్రొద్దుటూరు, కడప జిల్లా విద్యా రంగానికి గర్వకారణంగా నిలిచింది.

 

జవహర్ మున్నీర్ విజయాన్ని ప్రొద్దుటూరు ఎంఈఓ సావిత్రి, ఎంఈఓ-2 శోభారాణి, పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు అభినందించారు. ఫిన్లాండ్ శిక్షణ ద్వారా పొందే నూతన బోధనా పద్ధతులను తిరిగి మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించడం ద్వారా మరింత మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఆమె బాటలు వేయాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!