🌟 ప్రొద్దుటూరు నుంచి ఫిన్లాండ్ వరకు… షేక్ జవహర్ మున్నీర్ విజయ ప్రస్థానం!

    –రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నుంచి అంతర్జాతీయ శిక్షణకు ఎంపిక   సలాం  ప్రొద్దుటూరు: ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిగా సేవలందిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషి చేసిన షేక్ జవహర్ మున్నీర్ మరో అరుదైన ఘనత సాధించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఆమె తాజాగా ఫిన్లాండ్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్ (FLN) శిక్షణా కార్యక్రమానికి ఎంపికయ్యారు.   ప్రొద్దుటూరు లింగారెడ్డి కొట్టాలులోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న జవహర్ మున్నీర్‌కు ఫిన్లాండ్ శిక్షణకు...