
–మైదుకూరు 14వ వార్డులో జోరుగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’
సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు):
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన 45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం మైదుకూరు మున్సిపాలిటీ 14వ వార్డులోని 86, 87వ బూత్‌లలో ఉత్సాహంగా నిర్వహించారు.
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో టీడీపీ పట్టణ అధ్యక్షులు, రాష్ట్ర కనీస వేతనాల డైరెక్టర్ దాసరి బాబు, టీడీపీ మైనారిటీ పట్టణ అధ్యక్షులు పాల బాబు నాయకత్వం వహించారు. నాయకులు, కార్యకర్తలు వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా దాసరి బాబు, పాల బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నాయకత్వంలో మైదుకూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ముందుకు సాగుతోందన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా స్థానిక సమస్యల పరిష్కారానికి మరింత సమర్థవంతంగా కృషి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
“ప్రజల వద్దకు నాయకులు వెళ్లాలి.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలి. ప్రతి ఇంటి సమస్యను గుర్తించి పరిష్కారం దిశగా అడుగులు వేయడమే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం లక్ష్యం” అని వారు తెలిపారు.
45 రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమం ద్వారా వార్డుల వారీగా ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు నాయకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమాల్లో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ, యూనిట్ ఇన్‌చార్జ్ తుపాకుల రమణ, 5వ వార్డు ఇన్‌చార్జ్ అల్తాఫ్ హుస్సేన్, 87వ బూత్ ఇన్‌చార్జ్ మాబుషెన్, దాసరి సత్యనారాయణ, భూమిరెడ్డి అంజి, సిద్ధయ్య తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

