ప్రజల ముంగిటకు టీడీపీ.. ప్రతి ఇంటికీ సంక్షేమ సందేశం
–మైదుకూరు 14వ వార్డులో జోరుగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు): ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన 45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం మైదుకూరు మున్సిపాలిటీ 14వ వార్డులోని 86, 87వ బూత్‌లలో ఉత్సాహంగా నిర్వహించారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో టీడీపీ పట్టణ అధ్యక్షులు, రాష్ట్ర కనీస వేతనాల...