ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఎడిటోరియల్అన్న క్యాంటీన్‌లో భోజన నాణ్యతపై ఆరా తీసిన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి

అన్న క్యాంటీన్‌లో భోజన నాణ్యతపై ఆరా తీసిన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి

📰 Generate e-Paper Clip

 

–“ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో పేదలతో మమేకం

 

సలాం   ప్రొద్దుటూరు:

“ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మంగళవారం ప్రొద్దుటూరు పట్టణంలోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న పేదలు, కార్మికులతో మాట్లాడి భోజనం నాణ్యత, రుచి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.

 

అన్న క్యాంటీన్‌లో అందిస్తున్న భోజనం రుచికరంగా, బాగుందని పలువురు లబ్ధిదారులు మాజీ ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం మల్లెల లింగారెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

 

అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కామిశెట్టి బాబు, మాజీ కౌన్సిలర్ రామసంజీవరెడ్డి, ప్రొద్దుటూరు పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు శామీర్ భాషా, టప్పా మహబూబ్ భాషా, ఎన్‌టీఆర్ సిద్ధయ్య, జిల్లెళ్ల వెంకటేష్, రాము నాయుడు, కదిరి రామకృష్ణారెడ్డి, ద్వార్శల వెంకటరెడ్డి, గంగుల రంగారెడ్డి, గిద్దలూరు ఈశ్వరయ్య, మహమ్మద్ రఫీ, సీజే సుబ్బయ్య, క్రిష్ణయ్య, షేక్ వల్లీతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!